Friday 8 June 2012

తెలివిమీరిన దొంగలు

చాల రోజుల కిందట సంగతి. 
ఒక పేద్ద దొంగల గుంపు. దాంట్లో రెండు వర్గాలు. 
చాల సామరస్యంగా అంతా కలిసి వంతుల వారిగా దోచుకుంటున్నారు. 
ఒక తెలివైన దొంగ బయలుదేరాడు మొదటి వర్గం నుంచి. 
అందరి కంటే ఎక్కువ దోచుకోవడం మొదలు పెట్టాడు. 
తాను తప్ప మిగతా వాళ్ళంతా దొంగలు అని ప్రచారం చేయించాడు. జనం నమ్మారు. 
తన దొంగతనం ఎప్పటికి బయటపడదు, కలకాలం సాగుతుంది అనుకున్నాడు. 
పక్క వర్గం నుంచి మరొక తెలివైన మరియు బలవంతుడైన దొంగ తయారు అయ్యాడు ఈలోపల. 
ఎవరికీ ఇక దోచుకోవడానికి మిగలకుండా దోచుకోవడం మొదలు పెట్టాడు. మిగతా దొంగలకు కడుపు మండింది వీడి దుర్బుద్ధి చూసి( దొంగ బుద్ది మాత్రమే అయితే క్షమించే వాళ్ళు మరి) . 
వీడు దొంగతనానికి బయలు దేరినప్పుడు మిగతా దొంగలంతా కలిసి ఉరి జనాలకు ఉప్పందించారు.
దొంగ దొరికాడు. 
జనం దొరికిపోయిన దొంగ ను తన్నబోయారు. అప్పుడు ఆ దొంగ " అయ్యా నా కంటే ముందు 
ఎవరూ  దొంగతనం చెయ్యలేదా? పట్టుపడని దొంగల సంగతి ఏమిటి? ముందు వాళ్ళను తన్నండి. 
నేను మిగతా దొంగలకు ఎదురు తిరగడం వలన అంతా నా మీద కక్ష్య కట్టి నన్ను పట్టుపడేలా చేసారు. 
కాబట్టి నన్ను తన్నకుండా సానుభూతి చూపించండి. ఈ ఉరికి నన్ను పెద్దను చెయ్యండి, 
దొంగతనం అనేదే లేకుండా చేస్తాను" అన్నాడు. 
అప్పుడు జనం " దొరికిన వాడే దొంగ అనే సామెత వినలేదా? అయినా ఎవరెవరు దొంగలో మాకు తెలియదా? పట్టుపడని దొంగలు ఇంకా ఉన్నంత మాత్రాన పట్టుపడిన నువ్వు దొంగను కాకుండా పోతావా? ఈ రోజు నీ వంతు రేపు మిగతా దొంగల వంతు. మీ దొంగల మధ్య కక్ష్యల పేరు చెప్పి నీ మీద సానుభూతి చూపించాలా" అని అడిగి ఇంక జీవితం లో దొంగతనానికి పోకుండా ఉండేలా కొట్టారు.


పట్టుపడని దొంగలు చాలా మంది ఉన్నంత మాత్రాన  దొరకిన దొంగ  నేను దొంగ ను కాదు అని అనగలడా? మామూలు దొంగలు అయితే అనలేరేమో. అయితే తెలివిమీరిన దొంగలు????